కామారపు లక్ష్మీ.. కరీంనగర్‌లో ఉంటున్న మామూలు మహిళ.. కానీ మార్చి 26 ఉదయంతో సెలబ్రిటీ అయింది.. నిండు గర్భంతో.. 30 నిమిషాల్లో 5 కిలోమీటర్లు పరిగెత్తి..అందరి దృష్టి ఆకర్షించింది.. ప్రెగ్నెన్సీ సమయంలో పూచిక పుల్ల కూడా పక్కకు పెట్టొదంటారే.. మరి లక్ష్మీకి ఎలా సాధ్యమైంది? అలా అందరూ చేయొచ్చా?సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా.. ఇప్పుడామెకు సుఖ ప్రసవం అయింది.. పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది..అసలు ఏం చేస్తే నార్మల్ డెలవరీ అవుతుందో డాక్టర్లు సలహాలిస్తున్నారు చదవండి..
కీళ్ల నొప్పులు, మరే ఇతర నొప్పులకు కరెంట్ పరికరాలతో చికిత్స చేస్తుంటారు. కానీ గర్భిణీ విషయంలో ఇలాంటి చికిత్స పనికిరాదు. అందుకు వ్యాయామమే ప్రత్యామ్నాయం. ఏయే కండరాలు సమస్యకు కారణమో గుర్తించాలి. బిగుసుకుపోయిన కండరాలను బలోపేతం చేసేందుకు వ్యాయామాలు చేయాలి. ఎక్కువ సమయం నిల్చోవడం, కాలు కిందకు పెట్టుకొని కూర్చోవడం లాంటివి చేయకూడదు. కాలు మీద కాలు వేసుకోవడం కూడా మంచిది కాదు. ప్రతి గంటకు కొన్ని సెకన్లపాటు కిందకు పైకిఈ కదిలించాలి. పెల్విక్ ఫ్లోర్ అవసరమైన కండరాలను బలోపేతం చేసి కాన్పు సులువు చేస్తుంది. ఆధునిక పరిశోధన ప్రకారం వారానికి 5 రోజులు, రోజుకు 30 నిమిషాలు నడక, వీలైతే సైక్లింగ్, కుదిరితే ఈత వంటి సులువైన ఏరోబిక్ ఎక్సర్‌సైజులు కూడా చేయొచ్చట. దీనివల్ల ఎలాంటి హానీ జరగదంటున్నారు డాక్టర్లు.
-రోజు ఉదయం, సాయంత్రం ఒక అరగ్రాము దాల్చినచెక్క నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ ఉండాలి. దీనివల్ల గర్భసమయానికి బలం చేకూరుతుంది. అయితే ఇది మోతాదు మించితే మంచిది కాదు.
-నొప్పులు మొదలయ్యాక ఎడమ అరచేతిలో గుండ్రటి అయస్కాంతాన్ని ఉంచితే సుఖప్రసవం జరుగుతుందట!
-ఉత్తరేణి వేళ్లు, ఆకులు, కొమ్మలు అన్నిటిని గుజ్జుగా చేసి నొప్పులు మొదలయ్యాక గోరింటాకులా దాన్ని కాలి వేళ్లకు, చేతి వేళ్లకు పెట్టాలి.
-నొప్పులతో బాధపడుతున్నప్పుడు కుంకుమపువ్వులో సొంపు కలిపిన నీటిని తాగిస్తే సుఖ ప్రసవం జరుగుతుంది.
-రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి, కొబ్బరినీళ్లు, నిమ్మరసం, తాజా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
-ఆహారంలో ఎక్కువగా పిండిపదార్థాలు, గుడ్లు, పాలు, మాంసకృత్తులు ఉండేలా జాగ్రత్త పడాలి.
-గర్భిణులకు నిద్రలేమి సమస్య ఉంటుంది. అలాంటప్పుడు పడుకోబోయే ముందు వేడిపాలు తాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్రపడుతుంది. ఎనిమిది నుంచి పది గంటల నిద్ర అవసరం.
-కొన్నిరకాల కాస్మొటిక్స్‌లో రసాయనాలు కలుపుతారు. అలాంటివి వాడకపోవడమే మంచిది. లేకపోతే శిశువు మీద ప్రభావం చూపుతాయి.
-పాదాలకు ఎప్పుడూ రక్షణ కల్పించాలి. కాళ్లకు కరెక్ట్‌గా సరిపోయే, సౌకర్యంగా ఉండే చెప్పులనే ధరించాలి. ఎత్తుమడమల చెప్పులు వేసుకోకూడదు. కాళ్లు, పాదాలు వాపులు రాకుండా జాగ్రత్తపడాలి.
-శరీరాన్ని ఎప్పుడూ కూల్‌గా ఉంచుకోవాలి. వేడినీటితో స్నానం చేయకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.
-చివరగా బరువు పెరుగుతున్నారా? లేదా గమనించుకోవాలి. తొమ్మిదో నెల వచ్చేసరికి కనీసం ఎనిమిది లేక తొమ్మిది కిలోల బరువు పెరగాలి. పెరగలేదంటే.. ఏదో సమస్య ఉన్నట్లే!
Source: sakshi
No comments:
Post a Comment