సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. అనారోగ్యం, శరీరంలో ఏదైనా ఒక భాగంలో నొప్పులు లేదా భారీకాయం వంటి అంశాల వల్ల కూడా సరిగ్గా నిద్రపట్టదు. అటువంటి సమస్యలకు తోడు మానసిక ఆదుర్దా, అతి ఆలోచనలు కలిగి ఉంటే నిద్రలేమి ఏర్పడుతుంది. ఇటు వంటి అసౌకర్యాలను వీలైనంత త్వరగా దూరం చేసుకోవాలి. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి.
అంతే కాదు చాలా మంది నిద్రపోవడానికి నిద్రమాత్రలు వేసుకుంటారు అది ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. ఉదయం నిద్రలేవగాని కడుపు ఉబ్బరం, మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, యాసిడి రిఫ్లెక్షన్, విరేచనాలు ఇలాంటివి మరికొన్ని జీర్ణక్రియ సమస్యలు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది. ఇవి కడుపును అసౌకర్యంగా ఉంచుతాయి.
---> ఫ్రైడ్ ఫుడ్స్ రాత్రిళ్లో తినకూడదు. వీటిని హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు మరియు ట్రాన్స్ కొవ్వు థమనులను పాడుచేస్తాయి. జీర్ణం అవ్వడానికి కూడా కష్టం అవుతుంది. దాంతో నిద్రలేకుండా చేస్తుంది.
---> ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన పాస్తా పిండితో కూడినటువంటి ఆహారం. ఒక రకమైనటువంటి నిశితమైన ధాన్యంతో తయారు చేయబడిన పాస్తా తినడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకొని, నిద్రకు అంతరాయ్యం కలిగిస్తుంది. కాబట్టి నిద్రించే ముందు వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
---> కాఫీ, టీ, కోలా డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సోడా, తదితరాలను మానేయాలి. ఇవి ఆన్నాశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. ఫలితంగా నిద్రలేమి. కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.
---> ఫిన్ ఉపయోగించడం మన ప్రస్తుత దినచర్యలో ఒక భాగమై పోయింది. నిద్రలేవగాని కాఫీ త్రాగందే పని మొదలవుదు. అయితే నిద్రలేమితో బాధపడేవారు ఈ కెఫిన్ ఆహారాలు(కాఫీ, టీ, చాక్లెట్స్, మరియు ఎనర్జీ డ్రింక్స్)కు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా కెఫిన్ వాడబడిఉంటుంది.
---> గ్రీసీ ఫుడ్స్, అంటే క్రీమ్(ఐస్ క్రీమ్స్), ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్, రాత్రి సమయంలో తినడం మానేయాలి. వీటిని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల మిమ్మల్ని అలసటకు గురిచేయడమే కాకుండా మరుసటి రోజు ఉదయానికి బద్దకస్తులుగా మార్చుతుంది. కడుపులో వీటివల్ల వికారం ఏర్పడి, విరేచనాలకు దారితీస్తుంది. బరువు పెరగడానికి దారితీసి ఆ ఫ్యాట్ ఫుడ్ ను నిద్రకు ముందు తీసుకోకపోవడం చాలా మంచిది.
---> చాక్లెట్స్ లో ప్యాట్స్, కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీకు నిద్రలేకుండా చేస్తుంది.
---> ఫాస్ట్ ఫుడ్స్/బర్గర్: ఈ రకమైన ఆహారాలు సందేహం లేకుండా నిద్రలేమికి గురిచేస్తాయి. ఇవి కొవ్వులను మాత్రం కలిగి ఉండటమే కాక, ఎక్కువగా కారంగా ఉంటాయి. దాంతో కడుపులో మంట, గ్యాస్ కు కారణం నిద్రలేమికి దారితీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ కు చెక్ పెట్టి సుఖనిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి.
---> స్పైసీఫుడ్స్ అతి కారంగా ఉన్న ఆహారాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, కారంగా ఉన్న సాస్ ఫుడ్స్, కారంగా ఉన్న పెప్పర్ ఫుడ్ తినడం వల్ల కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. ఈ నిరుపయోగకరమైన ఆహారాలను రాత్రి నిద్రించే ముందు తినకపోవడం వల్ల మీకు మంచి నిద్ర పట్టవచ్చు. కావట్టి ఎక్కువ కారం ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.
Source: boldsky